Lift: షాపింగ్ మాల్‌లో కూలిపడిన లిఫ్ట్..

లిఫ్ట్ కూలిపడిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో 16 మంది ఉన్నట్లుగా మాల్ సిబ్బంది తెలిపారు.

Lift: షాపింగ్ మాల్‌లో కూలిపడిన లిఫ్ట్..
X

న్యూస్ లైన్ డెస్క్: సంగారెడ్డి(Sangareddy) జిల్లా సదాశివపేటలోని ఓ షాప్పింగ్ మాల్‌(Shopping mall)లో ప్రమాదం జరిగింది. లిఫ్ట్(Lift) కూలిపడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన మాల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లోపల 16 మంది ఉన్నట్లుగా మాల్ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓవర్ లోడ్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it