Lok Sabha: జూన్‌ 18 నుంచి 18వ లోక్‌సభ ప్రారంభం

18వ లోక్‌సభ తొలి సమావేశం ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది.

Lok Sabha: జూన్‌ 18 నుంచి 18వ లోక్‌సభ ప్రారంభం
X

న్యూస్ లైన్ డెస్క్: 18వ లోక్‌సభ తొలి సమావేశం ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. ముందుగా రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్ తో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులందరికీ ప్రొటెం స్పీకర్ సభలో ప్రమాణం చేయిస్తారు. జూన్ 18, 19, 20 తేదీలలో మూడు రోజుల పాటు సెషన్లు కొనసాగే అవకాశం ఉంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జూన్ 20 తేదీన జరగనుంది. ఇక జూన్ 21న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేయనున్నారు. నేటి కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.

Tags:
Next Story
Share it