IPL: టాస్ గెలిచిన లక్నో.. ఢిల్లీతో వార్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

IPL: టాస్ గెలిచిన లక్నో.. ఢిల్లీతో వార్
X

న్యూస్ లైన్ స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జేట్లి స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో తలపడ్డగా ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ఎడిషన్‌లో రెండు జట్లు అంతగా రాణించడంలేదు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీకలంగా మారనుంది. ఈ ఎడిషన్ లో ఇప్పటి వరకు లక్నో 12 మ్యాచ్లు ఆడగా, అందులో 6 గెలిచి 6 మ్యాచ్ ల్లో ఓడి 12 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6 స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో 3 మ్యాచ్లు ఆడాయి. ఇందులో ఢిల్లీ రెండుసార్లు, లక్నో ఒకసారి మ్యాచ్ గెలిచాయి.

జట్టు వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: క్వింట‌న్ డికాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మార్క‌స్ స్టోయినిస్, దీప‌క్ హుడా, నికోల‌స్ పూర‌న్, ఆయుశ్ బ‌దొని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, ర‌వి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.

Tags:
Next Story
Share it