Kharge: ఒడిశా వెనుకబడటానికి బీజేపీ, బీజేడీలే కారణం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీ, బీజేడీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు.

Kharge: ఒడిశా వెనుకబడటానికి బీజేపీ, బీజేడీలే కారణం
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీ, బీజేడీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. ఒడిషాలో ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం తీవ్ర స్ధాయిలో ఉన్నాయ‌ని ఖర్గే మండిపడ్డారు. ఖ‌ర్గే గురువారం భువ‌నేశ్వ‌ర్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. 24 ఏండ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న న‌వీన్ ప‌ట్నాయ‌క్ హ‌యాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుక‌బ‌డింద‌ని అన్నారు. ఒడిశాలో పరిస్థితులు మారాలంటే రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలను మార్చాలని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం వెనుక‌బాటుత‌నానికి బీజేపీ, బీజేడీలే కారణం అని అన్నారు. ఒడిషా రాష్ట్రం నుంచి ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు వ‌చ్చార‌ని ఖ‌ర్గే గుర్తుచేసుకున్నారు. స్వతంత్ర పోరాటంలో పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూకు ప‌ట్నాయ‌క్ నుంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని అన్నారు. బీజేపీకి 100 సీట్లు కూడా రాదని, దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags:
Next Story
Share it