Medak: కరెంట్ షాక్‌తో తల్లీకొడుకు మృతి

మెదక్ జిల్లాలో (medak district) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్‌ (current shock) తగిలి తల్లీకొడుకు మృతిచెందారు.

Medak: కరెంట్ షాక్‌తో తల్లీకొడుకు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: మెదక్ జిల్లాలో (medak district) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్‌ (current shock) తగిలి తల్లీకొడుకు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండల (shivampet mandal) పరిధిలోని ఉసిరికపల్లికి (usirikapalli) చెందిన మణెమ్మ (manemma) (45) అనే మహిళ బట్టలు ఆరేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌ తగిలింది. అది గమనించిన కొడుకు ప్రసాద్ (Prasad), కూతురు శ్రీలత (srilatha) తల్లిని కాపాడటానికి వెళ్లి కరెంట్ షాక్‌కు గురైయ్యారు. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు అక్కడికక్కడే మృతిచెందగా.. కూతురు శ్రీలతకు తీవ్రగాయాలయ్యాయి. శ్రీలతను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it