Medak: నిలిచిపోయిన ధాన్యం రవాణా.. రోడ్డెక్కిన రైతులు

మార్కెట్‌కి (market) తీసుకొచ్చిన ధాన్యాని (crop) ప్రభుత్వం (government) కొనుగోలు చేయడం లేదని రైతులు (farmers) రోడ్డెక్కి ధర్నాలకు దిగారు. కనీసం తూకం వేసిన ధాన్యాని లారీలో (lorry) లోడ్ చేయకుండా ఆపుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Medak: నిలిచిపోయిన ధాన్యం రవాణా.. రోడ్డెక్కిన రైతులు
X

న్యూస్ లైన్ డెస్క్: మార్కెట్‌కి (market) తీసుకొచ్చిన ధాన్యాని (crop) ప్రభుత్వం (government) కొనుగోలు చేయడం లేదని రైతులు (farmers) రోడ్డెక్కి ధర్నాలకు దిగారు. కనీసం తూకం వేసిన ధాన్యాని లారీలో (lorry) లోడ్ చేయకుండా ఆపుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన మెదక్ జిల్లాలో (medak district) చోటుచేసుకుంది. చిలిపిచెడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో తూకం వేశాక లారీలు రాక.. ధాన్యం తరలించడం లేదని రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పండించిన ధాన్యాని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల అధికారులను కోరుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పంట పండించడమే పాపమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేతికొచ్చిన పంటకు నీరు అందించకపోవడంతో సగం పంట ఎండిపోయిందని.. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి ముద్దైందని రైతులు వాపోతున్నారు. కనీసం ఉన్న పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే వివిధ కారణాలు వల్ల ప్రభుత్వ అధికారులు కొనడం లేదని రైతులు మండేటి ఎండల్లో ధర్నాలు చేస్తున్నారు. ధాన్యాని తూకం వేసి లారీలు రావడం లేదని ఆపాడం ఏంటాని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

Tags:
Next Story
Share it