BRS: తప్పుడు ప్రచారంపై స్పందించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

ఇటీవల పార్టీ మారుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు.

BRS: తప్పుడు ప్రచారంపై స్పందించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
X

న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల పార్టీ మారుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కారు దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్న ప్రచారాన్ని గంగుల కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గంగుల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని, అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని పేర్కొన్నారు. కేసీఆర్ పర్యటన తర్వాతే కాల్వల్లోకి నీళ్లు వస్తున్నాయని గంగుల తెలిపారు. ప్రజల తీర్పు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటుందని, కరీంనగర్ లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:
Next Story
Share it