Modi: బాధ్యతలు స్వీకరించిన మోడీ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..

అధికారం చేపట్టిన వెంటనే ప్రధాని రైతు సంక్షేమం పైనే దృష్టి పెట్టారు.

Modi: బాధ్యతలు స్వీకరించిన మోడీ.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..
X

న్యూస్ లైన్ డెస్క్: నరేంద్ర మోడీ(Narendra Modi) మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్ పీఎంవో(South block PMO) కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రధాని రైతు సంక్షేమం పైనే దృష్టి పెట్టారు. ఈ మేరకే తన తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల పీఎం కిసాన్‌ నిధి విడుదల చేస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. అందుకే పీఎం కిసాన్‌కు సంబంధించిన ఫైల్​పై తొలి సంతకం చేశానని అన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని మోడీ తెలిపారు.

Tags:
Next Story
Share it