Actor Naresh: ఏపీ అల్లర్లపై స్పందించిన నరేష్

మరోవైపు పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనలను ఆపడానికి సెక్షన్ 144 అమలు చేయాల్సిన పరిస్థితి వచింది.

Actor Naresh: ఏపీ అల్లర్లపై స్పందించిన నరేష్
X

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andrapradesh)లోని మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో వైసీపీ(YCP), టీడీపీ(TDP) పార్టీల కార్యకర్తల మధ్య దాడులు తారాస్థాయికి చేరాయి. ఇటీవల కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. తిరుపతిలోని చంద్రగిరిలో స్ట్రాంగ్ రూం(Strong room)లను పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని(Pulivarthi Nani)పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ(Akhila priya) బాడీగార్డ్(Body guard)పై కూడా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తల మధ్య జరుగుతున్న ఘర్షణలు సామాన్యులు తీవ్ర గాయాలపాలయ్యే వరకు వచ్చాయి. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనలను ఆపడానికి సెక్షన్ 144 అమలు చేయాల్సిన పరిస్థితి వచింది. రాష్ట్రంలో నెలకొన్న ఈ తాజా పరిస్థితులపై సినీనటుడు నరేష్(Naresh) స్పందించారు. 'ఏపీలో ఎన్నికల పోరు ముగిసింది. నేను ఊహించినట్లుగానే ఎన్నికల ఫలితాలకు ముందు రక్తం చిందింది. ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏపీ ప్రజలకు అత్యంత ఇష్టమైన నాయకులు గెలవాలని, ఏపీలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను.' అంటూ నరేష్ ట్వీట్ చేశారు.

Tags:
Next Story
Share it