Nellore: బస్సుని ఢీకొట్టిన ఇసుక లారీ

ఏపీ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సుని ఓ ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Nellore: బస్సుని ఢీకొట్టిన ఇసుక లారీ
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సుని ఓ ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి కావలికి వెళ్తుండగా ఇసుక లారీ ఢీకొట్టింది. డ్రైవర్ సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it