NTR: ఎన్టీఆర్ 'టెంపర్' మూవీకి తొమ్మిదేళ్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr) నటించిన టెంపర్ (temper) సినిమా (cinema) విడుదలై తొమ్మిదేళ్లు పూర్తి అయ్యింది.

NTR: ఎన్టీఆర్ టెంపర్ మూవీకి తొమ్మిదేళ్లు
X

న్యూస్ లైన్, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr) నటించిన టెంపర్ (temper) సినిమా (cinema) విడుదలై తొమ్మిదేళ్లు పూర్తి అయ్యింది. డైనామిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ (puri jagannadh) ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అందించగా, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్‌తో పాటు డైరెక్టర్ కూడా ఫ్లాప్స్‌లోనే ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ ఖాతాలో మరో ఫ్లాప్ పడుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

ఇక ఈ సినిమా 2015 ఫిబ్రవరి 13న థియేటర్స్‌లో విడుదల అయ్యింది. ఈ మూవీలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ విద్వంసం సృష్టించాడు. ఇది కదరా ఎన్టీఆర్ సినిమా అంటే అని ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ హిట్ స్ట్రీక్ హిస్టరీ మొదలయ్యంది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూడలేదు.

Tags:
Next Story
Share it