Modi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్న మోడీ

Modi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్న మోడీ

Modi: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్న మోడీ
X

న్యూస్ లైన్ డెస్క్: ఈ నెల 12న గన్నవరంలో జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్‌‌ వద్ద జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధానితోపాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. తన ప్రమాణస్వీకారానికి రావాలని చంద్రబాబు మోడీని కోరాగా దీనికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోడీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన పార్టీలు కీలక ప్రాతలు పోషించారు. టీడీపీ పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలు గెలవడంతో ఎన్డీఏ కూటమికి బలం చేరింది. దీంతో ఎన్డీఏ కూటమి మోడీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమనికి టీడీపీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it