Rains: రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన

తెలంగాణలోని కొన్ని జిల్లాలకు మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Rains: రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన
X

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణలోని కొన్ని జిల్లాలకు మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, తెలంగాణలోని మరి కొన్ని ప్రాంతాల లోకి విస్తరించిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి ఉందని అకోలా, పుసాడ్, రామగుండం, విజయనగరం వరకు ఉందని అధికారులు హెచ్చరించారు. క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుండి రాష్ట్రం వైపునకు వేస్తుందన్నారు. రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల ఉన్నాయిని అన్నారు. అలాగే ఎల్లుండి ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కి. మి వేగంతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:
Next Story
Share it