Hyderabad: నగరంలో పలుచోట్ల వర్షాలు

గురువారం మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Hyderabad: నగరంలో పలుచోట్ల వర్షాలు
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) మహానగరంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కూకట్‌పల్లి, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌, బాచుపల్లి, జూబ్లీ హిల్స్, గాంధీ నగర్ రాంనగర, బంజారాహిల్స్, JNTU, కూకట్‌పల్లిలో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. దీంతో GHMC అధికారులు ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచారు. డిఆర్ఎఫ్ సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు ఫోన్ చేయాలని తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని సూచించారు. గురువారం మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాలకు చెందిన రైతులు అప్రమత్తంగా ఉంటూ.. ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని సూచించారు.

Tags:
Next Story
Share it