Rajasthan: కారు డోర్ లాక్.. మూడేళ్ల చిన్నారి మృతి

రాజస్తానలో (rajasthan) ఘోరం జరిగింది. ఓ మూడేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు కారులోనే (car) మర్చిపోయి డోర్ లాక్ (door lock) చేశారు. ఊపిరాడక ఆ చిన్నారి మృతిచెందింది.

Rajasthan: కారు డోర్ లాక్.. మూడేళ్ల చిన్నారి మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: రాజస్తానలో (rajasthan) ఘోరం జరిగింది. ఓ మూడేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు కారులోనే (car) మర్చిపోయి డోర్ లాక్ (door lock) చేశారు. ఊపిరాడక ఆ చిన్నారి మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని కోటాకి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ పెళ్లి వేడుకకు కారులో వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక ఇద్దరు కుమార్తెలు కారు దిగి తల్లితో కలిసి హాల్‌లోకి వెళ్లి ఉంటారని వారిని సరిగా చూడకుండానే తండ్రి కారు డోర్ లాక్ చేశారు. వేడుకలో రెండు గంటల పాటు విడివిడిగా ఉన్న వారు తిరిగి కారు దగ్గరకు వచ్చారు. చిన్న కూతురు కనిపించకపోవడంతో వారు కంగారు పడ్డారు. ఆ చిన్నారి కోసం వారు అక్కడ ఇక్కడ వెతికి చివరకు కార్ డోర్ తీశారు. వెనుక సీటులోనే పడి ఉన్న ఉన్న చిన్నారిని చూసి.. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఊపిరాడక ఆ చిన్నారి అప్పటికే చనిపోయినట్లు వారికి డాక్టర్లు తెలిపారు.

Tags:
Next Story
Share it