RGV: ప్రేక్షకులకు డబుల్ ధమాకా ‘వ్యూహం’, ‘శపథం’ ట్రైలర్ రిలీజ్!

తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ ను విడుదల చేశారు మేకర్స్.

RGV: ప్రేక్షకులకు డబుల్ ధమాకా ‘వ్యూహం’, ‘శపథం’ ట్రైలర్ రిలీజ్!
X

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మాణంలో వ‌స్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాల‌కు సెన్సార్‌ అడ్డంకులు వచ్చిన విష‌యం తెలిసిందే. కాగా, తెలంగాణ హైకోర్టు కొని సూచనలతో సెన్సార్‌ కు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. మొద‌టి పార్ట్ ‘వ్యూహం’ మూవీని ఈ నెల 23న విడుద‌ల చేయ‌నుండ‌గా.. రెండో పార్ట్ ‘శపథం’ ను మార్చి 1న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆర్జీవీ ప్ర‌క‌టించాడు. ఇక ఈ రెండు సినిమా తేదీలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్‌లో బిజిగా ఉన్నా మేక‌ర్స్. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఇక ట్రైలర్ చుస్తే.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఓ వ్యూహంతో సీఎం జగన్‌ను ఎలా ఎన్నికల్లో ఓడించాలని అనుకున్నారు అని చూపించాడు రామ్ గోపాల్ వర్మ. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయం ఈ ట్రైలర్‌లో కనిపిస్తుంది. తొలిపార్టు ‘వ్యూహం’లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏం జరిగిందని.. రెండో పార్ట్‌లో వైఎస్ జగన్ ఎలా సీఎం అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో రామ్‌గోపాల్‌ వర్మ ఈ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన వ్యూహం టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Tags:
Next Story
Share it