Razakar: ఆసక్తికరంగా.. రజాకార్ ట్రైలర్ రిలీజ్!

లేటెస్ట్‌గా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

Razakar: ఆసక్తికరంగా.. రజాకార్ ట్రైలర్ రిలీజ్!
X

న్యూస్ లైన్ సినిమా: తెలంగాణ చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం అన్న డైరెక్టర్ యాట సత్య నారాయణ తెలంగాణలో రజాకార్ల చేసిన అరాచకాలపై ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రజాకార్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందు రానుంది. లేటెస్ట్‌గా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ 1948 మధ్య కాలంలో ఇండియన్ యూనియన్‌లో చేరడానికి ముందు నిజాం హైదరాబాద్‌‌‌‌లో జరిగిన సంఘటనల ఆధారంగా చేసుకుని తెరెకెక్కించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ట్రైలర్ చూస్తే.. వాళ్ళు ఇక్కడ మతమైనా మారాలి.. లేదా రాజ్యమైన వదలాలి అనే డైలాంగ్‌‌‌తో షురూ అవుతుంది. యుద్ధం చేయాల్సిందే.. ఆ మతోన్మాదులను కతం చేయాల్సిందే, చర్చలు లేవు.. సందీ లేదు.. యుద్ధం జరగాల్సిందే అనే డైలాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలంగాణ బిడ్డ మన తెలంగాణ మూలాలు, అనుభవించిన దురవస్థలు తెలుసుకోవడం ఈ మూవీ నేపధ్యం అని దర్శకుడు సత్య నారాయన తెలిపారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, స్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలో నటిస్తున్నారుర. ఈ సినిమా వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు సత్య నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 1న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Tags:
Next Story
Share it