breaking news: కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలోని రియాక్టర్లు పేలి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

breaking news: కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
X

న్యూస్ లైన్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలోని రియాక్టర్లు పేలి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 10మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. కంపెనీలో పేలుడుతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. కంపెనీలో మరో రియాక్టర్ కు కూడా మంటలు వ్యాపించాయి. అది కూడా పేలితే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tags:
Next Story
Share it