NVSS Prabhakar: రెంవంత్ రెడ్డికి రైతుల కన్నీళ్లు కనబడవు

తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మొండిచేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు.

NVSS Prabhakar: రెంవంత్ రెడ్డికి రైతుల కన్నీళ్లు కనబడవు
X

న్యూస్ లైన్ డెస్క్: రైతన్నల కన్నీళ్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy)కి కనబడవని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(NVSS Prabhakar) అన్నారు. గురువారం పార్టీ కార్యాలయం(party office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడమే కాకుండా.. రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మొండిచేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు కూడా జరగక రైతులు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. కొన్ని చోట్ల ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ అంటూ ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టారని విమర్శించారు. రైతు రుణమాఫీపై సీఎంకు కూడా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. రైతు సమస్యలపై రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పటు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it