Kishan reddy: రేవంత్.. ఇప్పటికైనా అబద్దాలు మానుకో

అబద్దపు హామీలతో కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఎద్దేవా చేశారు.

Kishan reddy: రేవంత్.. ఇప్పటికైనా అబద్దాలు మానుకో
X

న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) అన్నారు. ఈరోజూ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం(press meet)లో ఆయన మాట్లాడారు. అబద్దపు హామీలతో కాంగ్రెస్(Congress) నాయకులు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు(Free bus) ప్రయాణం కోసం ఆర్టీసీ(RTC)కి చెల్లించాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. పెళ్లి చేసుకుంటే.. తులం బంగారం ఇస్తామన్నారు.. ఒక్కరికైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆ హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆరోగ్య శ్రీ వంటి పథకాన్ని నిలిపేశారని.. వీటి పట్ల కూడా కాంగ్రెస్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:
Next Story
Share it