Road Accident: పాదచారులపై దూసుకెళ్లిన గూడ్స్ ట్రాలీ.. వ్యక్తి మృతి

వరంగల్ (Warangal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఖానాపురం (khanapur) మండలం బుధరావుపేట (budharaopet) గ్రామశివారులో అశోక్ లేలాండ్ ట్రాలీ ఓ వ్యక్తిని ఢీ కొట్టింది.

Road Accident: పాదచారులపై దూసుకెళ్లిన గూడ్స్ ట్రాలీ.. వ్యక్తి మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: వరంగల్ (Warangal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఖానాపురం (khanapur) మండలం బుధరావుపేట (budharaopet) గ్రామశివారులో అశోక్ లేలాండ్ ట్రాలీ ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖానాపురం ఎస్.ఐ బొంగు మాధవ్ గౌడ్ (si bongu madhav goud) తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి బుధరావుపేట గ్రామ శివారులో రాత్రి సమయంలో బుధరావుపేట గ్రామానికి చెందిన బ్యాండ్ మాస్టర్ సయ్యద్ జానీ పాషా (38) పని ముగించుకుని తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో పెనుగొండ గ్రామానికి చెందిన అశోక్ లేలాండ్ ట్రాలీ డ్రైవర్ సయ్యద్ జానీ పాషాని ఢీకొట్టిండు. దీంతో సయ్యద్ పాషా సంఘటన ప్రదేశంలోనే మృత్యువాత పడ్డిన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. అనంతరం మృతిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్.ఐ మాధవ్ గౌడ్ తెలిపారు.

Tags:
Next Story
Share it