RS Praveen Kumar: అబద్ధపు హామీల కాంగ్రెస్‌ను ఓడించాలి

పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్‌ను ఓడించాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు

RS Praveen Kumar: అబద్ధపు హామీల కాంగ్రెస్‌ను ఓడించాలి
X

న్యూస్ లైన్ డెస్క్: రాబోయే పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్‌ను ఓడించాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసిన ప్రజలు వంద రోజుల్లోనే మోసపోయారన్నారు. గత పదేళ్లు తెలంగాణ రాష్టన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారని తెలిపారు. రైతులు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. సీఎం ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలపై బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచే చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉన్నాయన్న ఆయన సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు చావు అంచుల్లోకి వెళ్తున్నారని అవేదన చెందారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన మల్లు రవి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎంపీగా గెలిచి పార్టీ మారిన రాములు ఐదేళ్లలో పార్లమెంటులో అడిగిన ప్రశ్నలు కేవలం ఆరు మాత్రమేనన్నారు. అధికార పార్టీ నేతలు బీఆర్‌ఎస్ నాయకులను ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించలని కార్యకర్తలకు పిలుపునిచారు.

Tags:
Next Story
Share it