sachin tendulka: సచిన్ బాడీ గార్డ్ ఆత్మహత్య

. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్(SRPF) జవాన్‌ అయిన ప్రకాశ్‌ కాప్డే( prakash kapde) .. సచిన్‌ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు

sachin tendulka: సచిన్ బాడీ గార్డ్ ఆత్మహత్య
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్( sachin tendulkar) బాడీ గార్డ్( body gaurd) ఒకరు తుపాకీ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్(SRPF) జవాన్‌ అయిన ప్రకాశ్‌ కాప్డే( prakash kapde) .. సచిన్‌ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మహారాష్ట్రలోని జామ్నెర్‌( jamner) పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనను నేషనల్ మీడియా కవర్ చేస్తుంది.

కాప్డే (39) కొన్ని రోజులు సెలవు తీసుకొని తన స్వగ్రామానికి వెళ్లినట్లు తెలిపారు . అక్కడే తన సర్వీస్ తుపాకీతో( tupaki) మెడపై కాల్చుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లోనే అతడు ప్రాణాలు తీసుకున్నట్లు జామ్నర్ పోలీసులు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. వ్యక్తిగత కారణాల( personal issues) వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడవుతాయి’’ అని తెలిపారు.

ఈ కాప్డేకు తల్లి, తండ్రి , భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాప్డే వీవీఐపీ సెక్యురిటీలోని గార్డు కావడంతో ఎస్ఆర్‌పీఎఫ్‌ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆత్మహత్యకు తన పర్సనల్ విషయాలే కారణం కావచ్చని ...వృత్తిలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని తన సహచరులు చెబుతున్నట్లు తెలిపారు. కేసును మరింత దర్యాప్తు చేసిన తర్వాతే..మరిన్ని వివరాలు తెలియజేయగలమని తెలిపారు.

Tags:
Next Story
Share it