T20 Worldcup: హై టెన్షన్ పోరులో సఫారీ అద్భుత విజయం

న్యూయార్క్‌లోని న‌స్సౌ కౌంటీ స్టేడియం వేదిక‌గా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో స‌ఫారీ జ‌ట్టు విషయం సాధించింది

T20 Worldcup: హై టెన్షన్ పోరులో సఫారీ అద్భుత విజయం
X

హై టెన్షన్ పోరులో సఫారీ అద్భుత విజయం

బాంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా విక్టరీ..!

బంగ్లా బౌలర్లపై క్లాసన్ ఊచకోత

డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్

కేశవ్ మహారాజ్ స్పిన్ షో

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్ర‌పంచక‌ప్‌లో భాగంగా మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ త‌ల‌ప‌డాయి. న్యూయార్క్‌లోని న‌స్సౌ కౌంటీ స్టేడియం వేదిక‌గా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో స‌ఫారీ జ‌ట్టు విషయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాటర్లు హెన్రీ క్లాసన్ బంగ్లా బౌలర్లకు ఊచకోత చూపించగా.. డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దాంతో దక్షణా ఆఫ్రికా, బంగ్లాదేశ్ జట్టుపై 4 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(18), రీజా హెండ్రిక్స్(0) ఇద్దరిని తంజిమ్ హసన్ సాకిబ్ వెనక్కి పంపాడు. ఆడ తర్వాత క్రీజులో దిగిన కెప్టెున్ ఐడెన్ మార్కార్(4), ట్రిస్టన్ స్టబ్స్(0) వరుసగా పెవిలియన్‌కు చేరారు. దీంతో సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రీ క్లాసన్, డేవిడ్ మిల్లర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరోవైపు క్లాసన్ బంగ్లా బౌలర్లకు ఊచకోత చూపించాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ విధ్వంస చేశాడు. ఇక కిల్లర్ మిల్లర్ మంచి ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఈ ఇద్దరు స్కోర్ బోర్డుకు 80 పరుగులు జతచేశారు. అయితే క్లాసన్(46) తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ కాసేపటికే మిల్లర్(29) కూడా వెనుదిరిగాడు. దీంతో సఫారి మిడిల్ ఆర్డర్ కూప్పకులింది. ఇక కేసవ్ మాహరాజ్(4), మార్కో జాన్సెన్(5) మంచి బ్యాటింగ్ చేశారు. దీంతో సౌతాఫ్రికా నిర్టీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు తంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు పడగొట్టాగా.. తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు.

స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఓపెనర్లు తంజిమ్ హసన్, నిజముల్ శాంటూ మంచి స్టార్ట్ అందించారు. కానీ అన్రీజ్ నోకియా బౌలింగ్ శాంటూ(14) వెనుదిరిగాడు. ఆ తర్వాత తాంజిద్(9) కూడా పెవిలియన్ కు చేరాడు. ఇక తర్వాత లిటన్ దాస్(9), షకీబ్ ఆల్ హాసన్(3) వరుసగా బ్యాటింగ్ లో విఫలమయ్యారు. దాంతో బంగ్లా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 50 రన్స్ చేసింది. ఈ సమయంలో క్రీజులో అడుగు పెట్టిన మహమ్మదుల్లా, టౌహిద్ హరిడోయ్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఇక హరిడోయ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ సఫారీ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కానీ హరిడోయ్(36), కాగిసో రబడా బౌలింగ్ ఎల్బిడబ్ల్యుగా ఔట్ అయ్యాడు. తర్వాత జాకెర్ అలీ(8)ను మహారాజ్ వెనక్కి పంపాడు. ఇక మొహమ్మదుల్లా(20) చివరి వరకు ఒంటరిగా పోరాడాడు. కానీ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్టుపై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ బౌలర్లు కేశవ్ మహారాజ్ మూడు వికెట్లతో బంగ్లా బ్యాటర్ల పై నిప్పులు చరగగా.. కాగిసో రబడా, అన్రిక్ నోకియా చెరో రెండు వికెట్లు తీశారు.

Tags:
Next Story
Share it