Accident: స్టీరింగ్ లాక్.. చెట్లలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా.. స్టీరింగ్ లాక్ అయిపోయింది.

Accident: స్టీరింగ్ లాక్.. చెట్లలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
X

న్యూస్ లైన్ డెస్క్: స్టీరింగ్(steering) ఒక్కసారిగా లాక్(Lock) అవ్వడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి ఆర్టీసీ బస్సు(RTC Bus) దూసుకెళ్లింది. రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండల పరిధిలోని పద్మనగర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా.. స్టీరింగ్ లాక్ అయిపోయింది. దీంతో అదుపుతప్పి బస్సు చెట్లలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ స్సును ఆపడంతో ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

Tags:
Next Story
Share it