RK Math: నిరంతర సాధనతో అత్యుత్తమ ఫలితాలు - స్వామి బోధమయానంద

త్రికరణశుద్ధితో చేసే నిరంతర, లోతైన సాధన ద్వారా ఆధ్యాత్మిక, వ్యవహారిక జీవితంలో అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చు

RK Math: నిరంతర సాధనతో అత్యుత్తమ ఫలితాలు - స్వామి బోధమయానంద
X

న్యూస్ లైన్ డెస్క్: త్రికరణశుద్ధితో చేసే నిరంతర, లోతైన సాధన ద్వారా ఆధ్యాత్మిక, వ్యవహారిక జీవితంలో అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చని హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. నిత్యజీవితంలోని ఇబ్బందులను అధిగమించేందుకు ఇదే మార్గమన్నారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం స్వర్ణోత్సవాలలో భాగంగా నిర్వహించిన ‘స్పిరిచ్యువల్ రిట్రీట్‌’లో సోమవారం ఆయన ప్రసంగించారు. స్వర్ణోత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్‌లో ఫిబ్రవరి 13న ‘వివేకానంద డే’ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు స్వామి వివేకానంద హైదరాబాద్‌లో పర్యటించారని, స్వామి బోధమయానంద అన్నారు. ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్‌లో తన జీవితంలోనే ఒక బహిరంగ సభను ఉద్దేశించి స్వామి వివేకానంద తొలిసారి ఆంగ్ల ప్రసంగం చేశారన్నారు. నాటి సభకు హాజరైన మేధావులను, విద్యావంతులను స్వామి వివేకానంద తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేశారని బోధమయానంద తెలిపారు. ‘వివేకానంద డే’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. రిట్రీట్ కార్యక్రమంలో స్వామి నిత్యస్థానంద మాట్లాడుతూ ఆత్మసాక్షాత్కారమే జీవన లక్ష్యమని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారని గుర్తు చేశారు. హృదయంలో ఆధ్యాత్మిక జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలన్నది శ్రీరామకృష్ణుల మాట అన్నారు. రిట్రీట్ కార్యక్రమంలో పలువురు స్వాములు హైదరాబాద్ రామకృష్ణ మఠంతో ఉన్న అనుబంధాన్ని తమ ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు.

Tags:
Next Story
Share it