T20 Worldcup: కెనడా పై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ..!

పాకిస్థాన్, కెన‌డా జట్లు త‌ల‌ప‌డాయి. న్యూయార్క్‌లోని న‌స్సౌ కౌంటీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది.

T20 Worldcup: కెనడా పై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ..!
X

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ బోణి

కెనడా పై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ

హాఫ్ సెంచరీతో చెలరేగిన రిజ్వాన్

బాబర్ అజాం బ్యాటింగ్ షో

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు జరిగింది. ఈ మెగా టోర్నీలో భాగంగా మంగళవారం పాకిస్థాన్, కెన‌డా జట్లు త‌ల‌ప‌డాయి. న్యూయార్క్‌లోని న‌స్సౌ కౌంటీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. పాక్ బ్యాటర్లు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాగా.. బాబర్ అజాం హార్డ్ హిటింగ్ స్ట్రోక్స్‌తో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో కెనడా, పాకిస్తాన్ జట్టుపై 3 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెనడా జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. అరోన్ జాన్స‌న్ దూకుడు బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ మరో ఎండ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్ న‌వ్‌నీత్ ధ‌లివ‌ల్(4), మ‌హ్మ‌ద్ అమిర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ప‌ర్గాత్ సింగ్(2), నికోల‌స్ కిర్ట‌న్(1) పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశ పరిచారు. దీంతో కెనడా మూడు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ఇక ఓపైపు వికెట్లు పడుతున్న పాక్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంత్ అరోన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అరోన్(52) నసీమ్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ మొవ్వ‌(2), సాద్ బిన్ జాఫ‌ర్(10), రవీందర్‌పాల్ సింగ్(0) పరుగులు రాబట్టలేక వరుసగా పెవిలియన్‌కు చేరారు. దీంతో పాక్ బౌలర్లు ఆరు వికెట్లు పడగొట్టి కెనడా నడ్డిని విరిచారు. చివరిలో క‌లీమ్ స‌నా(13), డిల్లాన్ హెల్గెర్(9) మంచి భాగస్వామ్యాని నెలకొల్పారు. దాంతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. పాక్ బౌలర్లు మ‌హ్మ‌ద్ అమిర్, హ్యారిస్ ర‌వుఫ్ రెండు వికెట్లు పడగొట్టాగా.. షాహీన్ ఆఫ్రిది, న‌సీం షా ఇద్దరు చెరో వికెట్ తీశారు.

‌107 పరుగులో ఛేదనలో పాకిస్తాన్ జట్టుకు ఇన్నింగ్స్ మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ సైమ్ అయూబ్(6)ను డిల్లాన్ హెల్గెర్ వెనక్కి పంపాడు. తర్వాత క్రీజులో కెప్టెన్ బాబర్ అజాం దిగాడు. ఇక బాబర్ కెనడా బౌలర్లపై రెచ్చపోయాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ స్టేడియంలో పరుగుల వరద పారించాడు. మహ్మద్ రిజ్వాన్ తో కలిసి మంచి పార్టనర్షిప్ నెలకొల్పాడు. ఈ ఇద్దరు స్కోర్ బోర్డుకు 70 రన్స్ జోడించారు. అయితే బాబర్(33), డిల్లాన్ హెల్గెర్ బౌలింగ్ లో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. ఈ సమయంలో బ్యాటింగ్ కు ఫాఖర్ జమాన్ వచ్చాడు. రిజ్వాన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ రిజ్వాన్ దూకుడు పెంచి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఫాఖర్(4), జెరమీ గొరడోన్ బౌలింగ్ లో భారీ షార్ట్ కు ప్రయత్నించి డిలీప్రీత్ బజ్వ బౌలింగ్ లో ఫాఖర్(4) పెవిలియన్ కు చేరాడు. ఇక రిజ్వాన్(53) ఆఖరి వరకు క్రీజులో నిలబడి పాకిస్తాన్ జట్టుకు విజయం అందించారు. దాంతో పాక్, కెనడా జట్టుపై 7 వికెట్లు తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. కెనడా బౌలర్ డిల్లాన్ హెల్గెర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Next Story
Share it