RRR: మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

RRR: మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు
X

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సీఐడీ మాజీ ఛీఫ్ సునీల్ కుమార్ ఐపీఎస్, సీతారామాంజనేయులు ఐపీఎస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ తనకు అయిన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానని పివి సునీల్ కుమార్ ఐపీఎస్ బెదిరించారని తెలిపారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఎస్పీకి కోరారు.

Tags:
Next Story
Share it