Teacher posts: త్వరలో టీచర్‌ పోస్టుల భర్తీ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి విద్యార్థులంతా మట్టిలో మాణిక్యాల్లా రాణించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని తెలిపారు.

Teacher posts: త్వరలో టీచర్‌ పోస్టుల భర్తీ
X

న్యూస్ లైన్ డెస్క్: డీఎస్సీ(DSC) ద్వారా త్వరలోనే టీచర్‌ పోస్టులు(Teacher posts) భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి(Ravindra Bharathi)లో పదో తరగతి టాపర్లకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సన్మానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి విద్యార్థులంతా మట్టిలో మాణిక్యాల్లా రాణించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని తెలిపారు.

ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లలో 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తుచేశారు. చాలా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్రమంత్రులు కూడా గవర్నమెంట్ స్కూళ్లలోనే చదివారని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడంలేదని వెల్లడించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని తెలిపారు. పిల్లలను చేపించకపోతే ప్రభుత్వ పాఠశాలలు మూతబడిపోతాయని తల్లిదండ్రులు చెప్పాలని రేవంత్ సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని టీచర్లకు సూచించారు. డీఎస్సీ ద్వారా టీచర్ల పోస్టుల భర్తీ కూడా చేస్తామని అన్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం రూ.80 వేలు ఖర్చు పెడుతోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో అధిక శాతం టీచర్ల జీతాలకే పోతుందని అన్నారు. అమ్మ ఆదర్శ పాథశాలల నిర్వహణతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామని అన్నారు.

Tags:
Next Story
Share it