T20 Worldcup: దాయాది పోరులో భారత్ ఘన విజయం.!

టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా విజయభేరి మోగించింది

T20 Worldcup: దాయాది పోరులో భారత్ ఘన విజయం.!
X

పాక్‌పై మనదే గెలుపు!

దాయాదితో పోరులో భారత్ ఘన విజయం.!

ఉత్కంఠ పోరులో భారత్ విక్టరీ

బ్యాటింగ్ తో రఫ్పాడించిన పంత్

జస్ప్రీత్ బుమ్రా టాప్ క్లాస్ బౌలింగ్ షో

స్వల్ప స్కోర్ చేసినా పాక్‌ను కట్టడి చేసిన బౌలర్లు

టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ సేన జోరు

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా విజయభేరి మోగించింది. భారత్ బ్యాటర్లు రిషబ్ పంత్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించగా.. అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ తో అధర్హో అనిపించాడు. దాంతో ఇండియా, పాకిస్తాన్ జట్టుపై 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(13), విరాట్ కోహ్లీ(4) ఇద్దరు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. తర్వాత క్రీజులో దిగిన రిషబ్ పంత్ విధ్వంసం ఇన్నింగ్స్ ఆడుతూ పాకిస్తాన్ బౌలర్లకు ఊచకోత చూపించాడు. ఫోర్లు బాదుతూ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. అక్షర్ పటేల్ తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఇద్దరు స్కోర్ బోర్డుకు 60 రన్స్ జోడించారు. అయితే అక్షర్(20) నసీమ్ షా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(7), శివం దుబే(3) వరుసగా పెవిలియన్ కు చేరారు. దాంతో టీమిండియా టాపార్డర్ విఫలైమైంది. కాగా, భారత్ ఐదు వికెట్ల కోల్పోయి 90 పరుగులు చేసింది. ఈ సమయంలో బ్యాటింగ్ కు దిగిన హార్దిక్ పాండ్యా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మొహమ్మద్ అమీర్ ఓవర్ లో పంత్(42), రవీంద్ర జడేజా(2) ఇద్దరిని వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన అర్షదీప్ సింగ్(9), మొహమ్మద్ సిరాజ్ (7) మంచి క్యాంయో ఇన్నింగ్స్ ఆడారు. కానీ అర్షదీప్ రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 19 ఓవర్ లోనే 119 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లు నసీమ్ షా, హ్యరిస్ రవుఫ్ మూడు వికెట్లు పడగొట్టాగా.. మొహమ్మద్ అమిర్ రెండు ఓకెట్లు తీశాడు.

లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పాకిస్తాన్ జుట్టుకి ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ బాబర్ అజం(15) బుమ్రా బౌలింగ్ లో స్లిప్ లో సూర్య కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత ఉస్మాన్ ఖాన్ (13) అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో పాక్ రెండు వికెట్లు కోల్పోయి 70 రన్స్ చేసింది. తర్వాత ఫాఖర్ జమాన్(13) పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అవగా.. మొహమ్మద్ రిజవాన్(31) బుమ్రా బైలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పాక్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇక ఇమద్ వాషిమ్(15), షాదబ్ ఖాన్(4), ఇఫ్టిఖర్ అహ్మద్(5), షహీన్ ఆఫ్రిది(1) బ్యాటింగ్ లో విఫలమయ్యారు. దాంతో టీమిండియా, పాకిస్తాన్ జట్టుపై 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో విజృంభించగా.. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు.

Tags:
Next Story
Share it