Congress: హద్దు మీరిన కాంగ్రెస్ ఆగడాలు.. ఆడవారిపై కూడా..

అంజయ్యతో పాటు ఆయన తల్లిదండ్రులు తమ్ముడు, చెల్లెలుపై కూడా విచక్షణ రహితంగా గొడ్డళ్లు, కర్రలతో దాడి దాడికి పాల్పడ్డారు.

Congress: హద్దు మీరిన కాంగ్రెస్ ఆగడాలు.. ఆడవారిపై కూడా..
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి BRS కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయి. పోలీసులకు భయపడకండి, ఎవరు ఏం చేసినా సీఎం రేవంత్ రెడ్డి తన హోదా పవర్ తో చూసుకుంటారని క్యాడర్‌తో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ఈ మాటలు చెప్పి 24 గంటలు కూడా గడవకముందే.. ఓ BRS కార్యకర్తను కాంగ్రెస్ కార్యకర్తలు హత్య చేశారు. ఇక ఇటీవల నాగర్ కర్నూల్ లో కూడా BRS కౌన్సిలర్ పైన దాడి జరిగింది. ఈ ఘటనలు మరువక ముందే రాష్ట్రంలో BRS కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం మద్దిమాడుగు గ్రామంలో BRS సర్పంచ్ అభ్యర్థి ఉడుతల అంజయ్య ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. అంజయ్యతో పాటు ఆయన తల్లిదండ్రులు తమ్ముడు, చెల్లెలుపై కూడా విచక్షణ రహితంగా గొడ్డళ్లు, కర్రలతో దాడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఉడుతల అంజయ్య, ఆయన తల్లి తిరుపతమ్మ తలలు పగిలిపోగా.. తమ్ముడు వెంకటేష్, చెల్లులికి గాయాలయ్యాయి.

Tags:
Next Story
Share it