Egg: కొండెక్కిన కోడిగుడ్డు ధర

అయితే, ఈ నేపథ్యంలోనే కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు ధరలు చూస్తుంటే.. సామాన్యుడికి కోడిగుడ్డు అందని ద్రాక్షగా మారిందని చెప్పొచ్చు.

Egg: కొండెక్కిన కోడిగుడ్డు ధర
X

న్యూస్ లైన్ డెస్క్: కోడిగుడ్డు(Egg) ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలో గుడ్ల వినియోగం బాగా పెరిగిందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(National Egg Coordination Committee) కూడా తెలిపింది. అయితే, ఈ నేపథ్యంలోనే కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు ధరలు చూస్తుంటే.. సామాన్యుడికి కోడిగుడ్డు అందని ద్రాక్షగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా గుడ్డును కొనలేని పరిస్థితి ఏర్పడింది. అధిక పోషకాలుండే గుడ్డును నిత్యం ఆహారంలో తీసుకునే చాలా మంది పెరిగిన ధరల కారణంగా గుడ్డును కొనలేకపోతున్నారు. రిటైల్‌ మారెట్‌లో ఒక గుడ్డు రూ.6.50 నుంచి రూ.7 వరకు ఉంది. మరో రెండు నెలల వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేసవి కావడంతో ఎండల కారణంగా లేయర్ కోళ్లు(Layer hens) ఫారంలోనే చనిపోతున్నాయని పౌల్ట్రీ(Poultry) వ్యాపారాలు తెలిపారు. ఎండలు కాస్త తగ్గుముఖం పడితే.. కోళ్లు చనిపోకుండా ఉంటే గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు. ఆ తర్వాత సప్లయ్ పెరిగితే గుడ్ల ధరలు కూడా తాగి అవకాశం ఉంది.

Tags:
Next Story
Share it