Tollywood: డబుల్ మాస్ ట్రీట్‌తో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’

రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా .. 85 సెకండ్ల డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.

Tollywood: డబుల్ మాస్ ట్రీట్‌తో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’
X

న్యూస్ లైన్, సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని (ram pothineni) తాజాగా నటిస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ (double ismart). డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (puri jagannadh) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (ismart Shankar) సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తున్న విషయం తెలిసిందే. రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా .. 85 సెకండ్ల డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.

ఇక ఈ సినిమాలో రామ్ లుక్స్, వైల్డ్ డైలాగ్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్, నాకు తెల్వకుండానే నాతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తే నా గుడ్డులో కాల్తది అని రామ్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రామ్ మరోసారి తెలంగాణ స్లాంగ్‌లో (telangana slang) అలరించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ‘సంజయ్ దత్’ (sanjay dutt) విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విలన్ ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్‌లో పెట్టిన చిప్‌ని తీసుకునేందుకు సంజయ్ దత్ ట్రై చేస్తున్నట్లు టీజర్‌ ద్వారా తెలుస్తుంది. వీరి ఇద్దరి మధ్య పూరి భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ జోడిగా ‘కావ్య థాపర్’ (kavya thapar) నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:
Next Story
Share it