TS ASSEMBLY: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీసిక్స్(V6) తయారు చేసిందా?

ఇరిగేషన్‌పై (IRRIGATION) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (power point presentation) అసెంబ్లీలో (assembly) ప్రకంపనలు సృష్టిస్తోంది.

TS ASSEMBLY: పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీసిక్స్(V6) తయారు చేసిందా?
X

న్యూస్ లైన్ డెస్క్: ఇరిగేషన్‌పై (IRRIGATION) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (power point presentation) అసెంబ్లీలో (assembly) ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసిన వారెవరన్న దానిపై సరికొత్త చర్చ జరుగుతోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వీసిక్స్(V6 NEWS) ఛానల్ తయారు చేసిందనే ప్రచారం జరుగుతోంది. పీపీ ఫైల్ నేమ్‌లో V6 అనే పేరు ఉండటమే దీనికి కారణం. ఆ వీసిక్స్ .. దేనికి సంకేతం? వీసిక్స్ న్యూస్ ఛానల్‌కు సంబంధించిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఓ ప్రైవేట్ ఛానల్‌ రూపొందించిన దానిపై చర్చను ఎలా చేపడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించే సత్తా ఉన్న అధికారులే లేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో నీటి ప్రాజెక్టులపై విషం చిమ్మింది వీసిక్స్. కాళేశ్వం (kaleshwaram), మేడిగడ్డ (medigadda) ప్రాజెక్టులపై ఎన్నో కథనాలను ప్రచురించింది. ఇంతగా విష ప్రచారం చేసిన ఆ వీసిక్స్/వెలుగు చేతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే.. దాని తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:
Next Story
Share it