Suicide: తెలంగాణలో మళ్లీ మొదలైన నిరుద్యోగుల ఆత్మహత్యలు

ఈ ఆత్మహత్యల పర్వం కొనసాగుతుండగానే.. మరో నిరుద్యోగి సూసైడ్ చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.

Suicide: తెలంగాణలో మళ్లీ మొదలైన నిరుద్యోగుల ఆత్మహత్యలు
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆత్మహత్యలు(Suicides) జరుగుతున్నాయి. ఇటీవల రైతన్నలు(Farmers), చేనేత కార్మికులు(Handloom workers), ఆటో డ్రైవర్లు(Auto drivers) ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు మరువకముందే మరో ఆత్మహత్య చోటుచేసుకుంది. కరెంటు కోతలతో నీరు అందక పంట నష్టం జరిగిందని కొందరు రైతులు ప్రాణాలు వదిలేస్తే.. అప్పుల బాధలు తాళలేక మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదిలా ఇలా ఉండగా.. తాము ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని నేతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతో తమకు బతుకుదెరువు కరువైందని ఆటోడ్రైవర్లు ఉసురుతీసుకున్నారు. ఈ ఆత్మహత్యల పర్వం కొనసాగుతుండగానే.. మరో నిరుద్యోగి సూసైడ్ చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం లేదని నిరుద్యోగి మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చెంగిచెర్ల కనకదుర్గ కాలనీలో ఉండే వడ్లకొండ రంజిత్(24) ఉద్యోగం రాకపోవడంతో గత కొంతకాలంగా మనోవేదన చెందాడని అతని తల్లి తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకొని రంజిత్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it