Uttar Pradesh: మథురలో కారు దగ్ధం.. ఐదుగురు సజీవ దహనం

మథురలో (Mathura) యమునా ఎక్స్‌ప్రెస్ వేపై (Yamuna express high way) వోల్వో బస్సు (Volvo bus), కారు (car) ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.

Uttar Pradesh: మథురలో కారు దగ్ధం.. ఐదుగురు సజీవ దహనం
X

న్యూస్ లైన్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మథురలో (Mathura) యమునా ఎక్స్‌ప్రెస్ వేపై (Yamuna express high way) వోల్వో బస్సు (Volvo bus), కారు (car) ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వోల్వో బస్సు టైర్ పంక్చర్ కావడంతో అడ్డం తిరిగింది, దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న మారుతి కారు ఆ బస్సుని ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణికులు త్వరగా దిగ్గగా, కారులోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నట్లు తెలిపారు.

Tags:
Next Story
Share it