Uttar Pradesh: ఆ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు రావడం కూడా కష్టామేనా!

ప్రధాని మోడీపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 140 సీట్లు రావడం కూడా కష్టమేనని ఆయన పేర్కొన్నారు.

Uttar Pradesh: ఆ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు రావడం కూడా కష్టామేనా!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రధాని మోడీపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 140 సీట్లు రావడం కూడా కష్టమేనని ఆయన పేర్కొన్నారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “యూపీలో బీజేపీ (bjp) ఒక్క చోట గెలవడం కూడా కష్టామే అని ఆయన అన్నారు. యూపీలో మొత్తం 80 స్థానాల్లో 79 చోట్ల ఇండియా కూటమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోందన్నారు. పత్రికలకు కూడా మంచి రోజులు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 4వ తేదీ ‘ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ డే’గా నిలబనుందని ఆయన అన్నారు.

యాపీలో నిరుద్యోగం, పేపర్ లీక్స్ వంటి సమస్యలతో బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ పాలనలో యువత నిరుద్యోగులగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో మోడీ దేశ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ఉద్యోగాలు సృష్టించడంలో, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు

Tags:
Next Story
Share it