Video: చిరుతకు చిక్కిన ఫారెస్ట్ అధికారి.. ఏం జరిగిందంటే..(వీడియో)

సెంట్రల్ కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం జిల్లాలోని ఓ గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. చిరుతని చూసిన గ్రామస్తులు పరుగులు తీశారు. అక్కడే ఉన్న అటవీఅధికారులు కొంతమంది చిరుతను బందించడానికి ప్రయత్నించారు.

Video: చిరుతకు చిక్కిన ఫారెస్ట్ అధికారి.. ఏం జరిగిందంటే..(వీడియో)
X

న్యూస్ లైన్ డెస్క్: సెంట్రల్ కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం జిల్లాలోని ఓ గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. చిరుతని చూసిన గ్రామస్తులు పరుగులు తీశారు. అక్కడే ఉన్న అటవీఅధికారులు కొంతమంది చిరుతను బందించడానికి ప్రయత్నించారు. చిరుత ఒక్కసారిగా ఓ అధికారి మీదకు దూకింది. అతడు కర్ర పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా చిరుత అతడి చేతిని కరిచి పట్టుకుంది. అతడు దైర్యంగా చిరుతతో పోరాడుతుండగా.. గ్రామస్తులు, అటవీఅధికారులు చిరుతను కర్రలతో కొట్టారు. కొద్దిసేపట్టికి చిరుత అతడి చేతిని వదిలిపెట్టింది. అటవీఅధికారులు చిరుతపులికి మత్తుమందు ఇచ్చి బోన్‌లో బందించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటవీశాఖ అధికారి దైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

Tags:
Next Story
Share it