Vijender Singh: బీజేపీలో చేరిన బాక్సర్

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ బాక్సర్, కాంగ్రెస్ పార్టీ నేత విజేందర్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Vijender Singh: బీజేపీలో చేరిన బాక్సర్
X

న్యూస్ లైన్ డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ బాక్సర్, కాంగ్రెస్ పార్టీ నేత విజేందర్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఆయన బీజీపీ కండువా కప్పుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసిన విజేందర్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో నటి హేమ మాలినిపై పోటీకి దిగుతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పలు చర్చలకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడ పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని విజేందర్ సింగ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Tags:
Next Story
Share it