Hema arrest: నటి హేమ అరెస్ట్..?

వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలిందని వెల్లడించారు.

Hema arrest: నటి హేమ అరెస్ట్..?
X

న్యూస్ లైన్ డెస్క్: సినీ నటి హేమ(Actress Hema) అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం బెంగళూరు ఏసీబీ పోలీసుల(ACB Police) ఆమెహాజరైంది. మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత నెల 20న హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ(Rave party)లో పాల్గొన్నట్లు పోలీసులు నిర్దారించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె డ్రగ్స్(drugs) తీసుకున్నట్లుగా తేలిందని వెల్లడించారు. కాగా, ఓ వ్యాపారవేత్త నిర్వహించిన రేవ్ పార్టీలో మొత్తం 101 మంది కన్నడ(Kannada), తెలుగు(Telegu) ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో హేమ కూడా పాల్గొన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

దీనిపై స్పందించిన హేమ.. ఓ వీడియోను విడుదల చేసింది. తాను రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని అందులో తెలిపింది. హేమ విడుదల చేసిన వీడియోపై స్పందించిన బెంగళూరు పోలీసులు.. బెంగళూరులోని పార్టీ జరిగిన ఫామ్ హౌస్(Farm house)లో హేమ ఉన్న ఫోటోను విడుదల చేశారు. హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్‌హౌస్‌లో షూట్‌ చేసిందేనని తెలిపారు. రేవ్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఫేక్ వీడియో విడుదల చేసి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు బెంగళూరు ఏసీబీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ హేమ హాజరుకాకపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Tags:
Next Story
Share it