IMD: ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు

భారతీయ వాతావరణ శాఖ (IMD) నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన చేసింది. ఏపీలో (AP) మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు (heavy rains) కురుస్తాయని వెల్లడించింది.

IMD: ఏపీలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు
X

న్యూస్ లైన్ డెస్క్: భారతీయ వాతావరణ శాఖ (IMD) నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన చేసింది. ఏపీలో (AP) మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు (heavy rains) కురుస్తాయని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో మోస్తరు నుంచి అధిక వర్షపాతం నమోదుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ భారీ వర్షాలకు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రతాలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Tags:
Next Story
Share it