Bomb Threat: ‘సరదా’ కోసం విమానానికి బాంబు బెదిరింపు!

సరదా కోసం 13 ఏండ్ల బాలుడు విమానాశ్రయాంకు బాంబు బెదిరింపు కాల్‌కు పాల్పడ్డాడు.

Bomb Threat: ‘సరదా’ కోసం విమానానికి బాంబు బెదిరింపు!
X

న్యూస్ లైన్ డెస్క్: సరదా కోసం 13 ఏండ్ల బాలుడు విమానాశ్రయాంకు బాంబు బెదిరింపు కాల్‌కు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢీల్లీ నుంచి టొరంటో వెళ్లే ‘ఎయిర్‌ కెనడా’ విమానానికి సోమవారం బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఓ 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని విచారించగా పలు ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. తనను పట్టుకుంటారా? లేదా? అని చెక్‌ చేసేందుకు సరదా కోసమే దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు ఆ తప్పుడు ఈమెయిల్‌ పంపినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. గతంలో ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటన గురించి బాలుడు తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే తప్పుడు బాంబు బెదిరింపు ఈమెయిల్‌ పంపాలనే ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే పోలీసులు తనను పట్టుకుంటారో? లేదో? చూడాలనుకున్నాడు. భయంతో తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదని, మరుసటి రోజు బాంబు బెదిరింపు వార్తలు చూసి ఉత్సాహపడ్డానని అతడు చెప్పినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.

Tags:
Next Story
Share it