Chandrababu: బాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు

బాబును చూడాలి అంటూ ఓ మహిళ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెంట పరుగులు తీసింది.

Chandrababu: బాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు
X

న్యూస్ లైన్ డెస్క్: బాబును చూడాలి అంటూ ఓ మహిళ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. మహిళను చూసిన చంద్రబాబు కారు ఆపి ఆమెతో మాట్లాడారు. విజయవాడ కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు రాగా కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. ఆ మహిళను చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‌ను ఆపి మహిళతో మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని తెలిపింది.

తనను చూసి ఎమోషనల్ అయి ఆ మహిళతో కొంచెం సేపు చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చాను అని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

Tags:
Next Story
Share it