AP: చెరువులో జారిపడి ముగ్గురు చిన్నారులు మృతి

ఏపీ (AP) తిరుపతి జిల్లాలో (Tirupati) తీవ్ర విషాదం చోటచేసుకుంది. చెరువులో (river) జారిపడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.

AP: చెరువులో జారిపడి ముగ్గురు చిన్నారులు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ (AP) తిరుపతి జిల్లాలో (Tirupati) తీవ్ర విషాదం చోటచేసుకుంది. చెరువులో (river) జారిపడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వడమాలపేట మండల పరిధిలోని ఎస్బీఆర్‌పురానికి చెందిన చిన్నారులు వాళ్ల తల్లి స్థానిక శివాలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం సమీపంలోని చెరువులో వద్దకు వెళ్లాగా.. ప్రమాదవశాత్తు ఆ చెరువులో చిన్నారులతో సహా తల్లీ కూడా జారిపడ్డారు. అది గమనించిన స్థానికులు చిన్నారులను, తల్లీని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తల్లి ప్రాణాలతో బయటపడగా.. ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it