KTR responded: BRS కౌన్సిలర్ ఇంటిపై దాడి.. స్పందించిన KTR

ఈ విషయంపై స్పందిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మీరు చెప్పే ప్రేమను పెంచడం అంటే ఇదేనా.. రాహుల్‌ జీ? అని ప్రశ్నించారు.

KTR responded: BRS కౌన్సిలర్ ఇంటిపై దాడి.. స్పందించిన KTR
X

న్యూస్ లైన్ డెస్క్: నాగర్‌కర్నూల్(Nagarkurnool) జిల్లా అచంపేటలో మహిళా కౌన్సిలర్(Counselor) ఇంటిపై జరిగింది. కౌన్సిలర్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. కర్రలతో ఫర్నిచర్(Furniture)ను ధ్వంసం చేశారు. అడ్డుకున్న కౌన్సిలర్ కుటుంబసభ్యులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దర్ని హాస్పిటల్(Hospital)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై నాఅగర్ కర్నూల్ BRS అభ్యర్థి RS.ప్రవీణ్ కుమార్(RS.Praveen Kumar) స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా, ఈ విషయంపై స్పందిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్(Tweet) చేశారు. మీరు చెప్పే ప్రేమను పెంచడం అంటే ఇదేనా.. రాహుల్‌ జీ? అని ప్రశ్నించారు. అధికార దుర్వనియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు, దుర్భాషల్లో పోలీసులు భాగస్వాములు కావడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఈ గూండాలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా వెంటనే చర్యలు తీసుకోకపోతే.. BRS ఈ కేసును మానవ హక్కుల కమిషన్‌కు తరలిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags:
Next Story
Share it