Crime: వైసీపీకి ఓటు వేసిందని కన్న తల్లిని చంపిన కొడుకు

వైసీపీకి (ycp) ఓటు వేసిందన్న కోపంతో ఓ కసాయి కొడుకు కన్న తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో (ananthapur district) చోటుచేసుకుంది.

Crime: వైసీపీకి ఓటు వేసిందని కన్న తల్లిని చంపిన కొడుకు
X

న్యూస్ లైన్ డెస్క్: వైసీపీకి (ycp) ఓటు వేసిందన్న కోపంతో ఓ కసాయి కొడుకు కన్న తల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో (ananthapur district) చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంబదూరు మండలం (kambadur mandal) పరిధిలోని ఎగువపల్లి గ్రామంలోని వడ్డే వెంకటేష్ (vadde venkatesh) అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో (tdp) తిరుగుతుండగా తల్లి వడ్డే సుంకమ్మ (vadde sunkamma) (45) వైసీపీకి ఓటు వేసినట్లు కొడుకుతో చెప్పింది. మద్యం మత్తులో వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో అతడు తల్లీతో గొడవకు దిగాడు. క్షణికావేశంలో కన్న తల్లి తలపై ఇనుప సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె చనిపోవడం చూసిన అతడు అక్కడనుంచి పరిపోయాడు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేష్ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Tags:
Next Story
Share it