Dattajirao Gaekwad: టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్‌ (95) మంగళవారం ఉదయం కన్నుమూశారు.

Dattajirao Gaekwad: టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత
X

న్యూస్ లైన్ స్పోర్స్: భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్‌ (95) మంగళవారం ఉదయం కన్నుమూశారు. బరోడాకు చెందిన గైక్వాడ్‌.. తన సొంత ఇంటిలోనే తుదిశ్వాస విడిచారు. 1952 నుంచి 1961 దాకా భారత జట్టు తరఫున 11 టెస్టులు ఆడిన దత్తాజీరావు.. దేశానికి సారథ్యం వహించినవారిలో అత్యధిక కాలం జీవించి ఉన్న సారథిగా ఘనత సొంతం చేసుకున్నారు. భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు గైక్వాడ్‌.. అక్కడ భారత్ కెప్టెన్ గా వ్యవహరించాడు. దత్తాజీరావు మరణం పట్ల బీసీసీఐతో ఎక్స్ ద్వారా సంతాపాన్ని ప్రకటించింది.

దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 సెంచరీలు 3, 139 పరుగులు చేశారు. రంజీలో అతని అత్యధిక స్కోరు 249 పరుగులు. 1959-60లో మహారాష్ట్రపై సాధివచారు. ఇక భారత జట్టు తరఫున 11 టెస్టులు ఆడిన గైక్వాడ్‌.. 350 పరుగులు చేశారు. ఇందులో ఒక అర్థ సెంచరీ కూడా ఉంది. జాతీయ జట్టులో తన ముద్ర వేయకపోయినా దేశవాళీలో మాత్రం గైక్వాడ్‌ పరుగుల వరద పారించారు. బరోడా తరఫున ఆడిన ఆయన.. 110 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 5,788 పరుగులు చేశారు. ఇందులో 17 శతకాలు, 23 అర్థ శతకాలున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 25 వికెట్లు తన ఖాతాలో ఉంది.

Tags:
Next Story
Share it