Madhya Pradesh: టోల్ ప్లాజా సిబ్బందిపై తుపాకులతో కాల్పులు

మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన అందరిని కలిచివేసింది. దుండగుల నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెత్తుతుండగా బావిలో పడి ఇద్దరు టోల్ ప్లాజా సిబ్బంది మృతిచెందారు.

Madhya Pradesh: టోల్ ప్లాజా సిబ్బందిపై తుపాకులతో కాల్పులు
X

న్యూస్ లైన్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన అందరిని కలిచివేసింది. దుండగుల నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి పరిగెత్తుతుండగా బావిలో పడి ఇద్దరు టోల్ ప్లాజా సిబ్బంది మృతిచెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మధ్యప్రదేశ్ లోని 44వ జాతీయ రహదారిలో గల దగ్రాయ్ టోల్ ప్లాజాలోకి నాలుగు బైక్ లపై ముసుగులు ధరించిన వ్యక్తులు కొందరు వచ్చారు. అక్కడ డ్యూటీలో ఉన్న శ్రీనివాస్ పరిహార్, శివాజీ కండెలె అనే ఇద్దరిపై ఆ వ్యక్తులు దాడికి దిగారు. టోల్ కౌంటర్ల తలుపులను తన్నడం, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. టోల్ ప్లాజా సిబ్బందిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుండగా.. అందులో ఒక్కరు తపాకీ తీసి గాల్లో కాల్పులు జరిపారు. తుపాకీలను చూసిన సిబ్బంది భయపడి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగులు తీశారు. భయంతో పరిగెత్తుండగా ఓ బావిలో పడి మునిగిపోయారు. టోల్ ప్లాజా యాజమాన్యం కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా సిబ్బంది ఇద్దరు పరిగెత్తిన వైపు వెళ్ళి వెతుకుతుండగా నిన్న (గురువారం) వారి మృతదేహాలను బావిలో నుంచి వెతికి తీశారు. చనిపోయిన శ్రీనివాస్ పరిహార్ ఆగ్రాకు, శివాజీ కండెలె నాగ్‌పూర్‌కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. CCTV ఫుటేజీ ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it