Mla Jagadish reddy: పట్టుదలతో పని చేస్తే విజయం మనదే

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Mla Jagadish reddy: పట్టుదలతో పని చేస్తే విజయం మనదే
X

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగులు, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిచ్చయంతో యువత ఉద్యోగులు ఉన్నారన్నారు. నల్గొండ- వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రచారంలో ఓటర్లను కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరుద్యోగులు, యువత ఎండగడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజయానికి కావలసిన సానుకూల వాతావరణం నియోజకవర్గంలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్న ప్రతి ఓటర్‌ను కలావాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల తరహాలో వారం రోజులు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజా క్షేత్రంలో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. మన పని విధానమే మన విజయానికి నాంది అని తెలిపారు. సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం ఖాయమన్నారు.

Tags:
Next Story
Share it