Rain Alert: ఆ జిల్లాలో భారీ వర్షాలు

హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ (meterological department) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ జిల్లాలో నేటి నుంచి 3,4 రోజులపాటు భారీ వర్షాలు (heavy rains) కురుస్తాయని అంచనా వేసింది.

Rain Alert: ఆ జిల్లాలో భారీ వర్షాలు
X

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ (meterological department) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆ జిల్లాలో నేటి నుంచి 3,4 రోజులపాటు భారీ వర్షాలు (heavy rains) కురుస్తాయని అంచనా వేసింది. ఈ రోజు రాష్ట్రంలోని జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ , వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూల్, చిత్తూర్, తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురువనున్నట్లు APSDMA అధికారులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారతీయ వాతావరణ శాఖ (imd) నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన చేసింది. రుతుపవనాలు మే 31వ తేదీన కేరళను తాకనున్నట్లు ఐఎండి అంచనా వేసింది. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి తెలిపింది.

Tags:
Next Story
Share it